గిరిజన, దళిత, పేద రైతులపై దాడికి నిరసగా మహబూబాబాద్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. దీంతో వెంటనే రైతు మహాధర్నాకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ క్యాంపు కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు.
మహబూబాబాద్‌లో గురువారం తలపెట్టాల్సిన ఈ రైతు మహా ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా హాజరు కావాల్సి ఉంది. దీంతో ఈ కార్యక్రమానికి అనుమతి కోసం రెండు రోజులుగా పోలీసులను విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ అధికారులు మాత్రం స్పందించలేదు. దీంతో వెంటనే అనుమతి ఇవ్వాలని కోరుతూ మహబూబాబాద్ ఎస్పీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ఈ ధర్నాలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, పోచంపల్లి శ్రీనివాసరావు, తక్కెల్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
గిరిజన, దళిత, పేద రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండకు నిరసనగా రేపు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు మహా ధర్నా అనుమతి కోసం రెండు రోజులుగా కోరుతున్నా స్పందించని పోలీసు అధికారులు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు హాజరయ్యే ఈ మహా ధర్నాకు అనుమతిని వెంటనే… pic.twitter.com/MI6002BDvH
— BRS Party (@BRSparty) November 20, 2024