నల్లబెల్లి, జూన్ 09 : లింగాలపల్లి గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త మృతి చెందడంతో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి మృతుడి అంతిమ యాత్రలో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శిం చారు. మండలంలోని లింగాలపల్లి గ్రామానికి చెందిన ఏరుకొండ వెంకటేష్ తండ్రి ఎరుగొండ రాములు గుండె పోటుతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బానోతు సారంగపాణి మృతుడి భౌతిక దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతిమ యాత్రలో ప్యాక్స్ చైర్మన్ చేట్టుపల్లి మురళీధర్, గ్రామ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి అశోక్, గ్రామ పార్టీ ప్రధాన కార్యదర్శి మామిళ్లపెళ్లి రాజు, కస్తూరి రవి, మాజీ సర్పంచ్ పప్పు శంకర్, మేకల సాంబయ్య, ఆకుల సాంబారావు, మాజీ ఉపసర్పంచ్ కక్కెర్ల శ్రీనివాస్, డాక్టర్ నరేష్, మాజీ ప్రజాప్రతినిధులు,గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు.