హైదరాబాద్,సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ):కాంగ్రెస్ ఇచ్చిన బీసీ హామీ అమలయ్యే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పేర్కొన్నారు. బీసీల నాయకత్వాన్ని ప్రొత్సహించింది బీఆర్ఎస్సేనని గుర్తుచేశారు. తెలంగాణ భవన్లో మంగళవారం బీసీ ముఖ్యనాయకులతో కేటీఆర్ భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా తమిళనాడులో వారి పర్యటనపై చర్చించి సూచనలు చేశారు. బీసీలకు చట్టసభల్లో, స్థానిక సంస్థల్లో అత్యధిక అవకాశాలు కల్పించామని, రాబో యే రోజుల్లోనూ మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూదనాచారి, ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రులు వీ శ్రీనివాస్‌గౌడ్, జోగు రామన్న, నేతలు రవీందర్‌సింగ్, మాజీ ఎమ్మెల్యేలు భిక్షమయ్యగౌడ్, గౌరీశంకర్, శుభపద్రపటేల్, కిశోర్‌గౌడ్, అంజనేయగౌడ్, ఉపేంద్రాచారి, పల్లె రవికుమార్‌గౌడ్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, చిరుమల్ల రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.