హైదరాబాద్: మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ (BRS) పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదర్షా కోట్లో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు.
అంతకు ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హైదరాషాకోట్లో క్షేత్రస్థాయి పరిశీలనకు బయల్దేరుతుండగా వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధులు మూసీ బాధితుల వద్దకు వెళ్లారు.
మూసీ, హైడ్రా బాధితులకు అండగా బీఆర్ఎస్..
మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదర్షాకోట్లో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా… pic.twitter.com/WrrQYmERhF
— BRS Party (@BRSparty) September 29, 2024
కాగా, మూసీ, హైడ్రా బాధిత కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్న విషయం తెలిసింది. వారితో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు. వారి గోడును విని కంటతడి పెట్టారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి మూసీ బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగానే హైదర్షాకోట్లో బీఆర్ఎస్ బృందం పర్యటిస్తున్నది.