మోర్తాడ్, ఏప్రిల్ 17: తులం బంగారంపై మాటతప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని పలు పోలీసుస్టేషన్లలో గురువారం ఫిర్యాదు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద రూ.లక్ష చెక్కుతోపాటు తులం బంగారం ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి మోసం చేసిన సీఎం రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని కోరారు.
ఈ మేరకు మోర్తాడ్, కమ్మర్పల్లి, భీమ్‌గల్ ఠాణాల్లో ఫిర్యాదు చేశారు. భీమ్‌గల్‌లో బుధవారం జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తులం బంగారం ఏమైందని ప్రజల పక్షాన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించినందుకు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి ముత్యాల సునీల్‌రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులను ఉసిగొల్పారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.