హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, నాగార్జునసాగర్ ఎడమ కాలువకు గండి పడి 20 రోజులైనా మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తంచేశారు. మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, నోముల భగత్ శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారీ వర్షాలతో చెరువులు, కాలువలకు పడిన గండ్లును పూడ్చకుండా రైతులకు నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. ఖమ్మంలో వరదలకు దెబ్బతిన్న కాలువలు, సాగర్ ఎడమ కాలువకు వెంటనే మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.
పంటకు నీళ్లందక రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని, ప్రజలను గాలికొదిలేసి మంత్రి ఉత్తమ్ కుటుంబంతో విహార యాత్రలు చేస్తున్నాడని విమర్శించారు. మంత్రి నియోజకవర్గంలో సర్కారు వైద్యులు అందుబాటులో లేక నర్సులే గర్భిణికి ప్రసవం చే యడం వల్ల శిశువు చనిపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రుణమాఫీ అడిగిన రైతులను అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాసమస్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులకూ రైతుబంధు ఇస్తామని చెప్పి ఇప్పుడు కౌలు రైతు, యజమాని మాట్లాడుకోవాలని మంత్రి అం టున్నాడని, ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. హె లికాప్టర్ను వాడుకోవడంలో నల్లగొండ జిల్లా మం త్రులు పోటీ పడుతున్నారని, 25, 30 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లో పోతున్నారని ఎద్దేవాచేశారు.