హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : మాజీ మంత్రి మల్లారెడ్డి, హరీశ్‌రావుపై కాంగ్రెస్ నాయకులు జరిపిన దాడి ఘటనపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు శనివా రం ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, శాసనసభ విప్ కేపీ వివేకానందగౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
అనంతరం దా సోజు శ్రవణ్ ప్రకటన చేస్తూ.. ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్లు జరగాల్సి ఉండగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో తెలంగాణ రౌడీ రా జ్యంగా మారిందని ఆరోపించారు. కనీస సంస్కారం లేకుండా, మాజీ మంత్రి మల్లారెడ్డిపై శుక్రవారం దాడి చేయడానికి ప్రయత్నించడం అత్యంత దుర్మార్గమైన చర్య అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావుపై దాడి జరుగడం కాంగ్రెస్ గూండాగిరీకి నిదర్శనమని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అసెంబ్లీ స్పీకర్ నియోజకవర్గంలోనే బీఆర్ఎస్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులను కాంగ్రెస్ వాళ్లు బెదిరిస్తున్నారని ఆగ్రహించారు.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోకుండా కాంగ్రెస్ సర్కార్ విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు చేసిన దాడులను మాజీ మంత్రి మల్లారెడ్డి నేతృత్వంలో శంభీపూర్ రాజు, కేపీ వివేకానందగౌడ్ ఖండించారు. అనంతరం ఏసీపీ, సీఐలపై విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు దాసోజు తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు రేవంత్ సర్కార్‌కు గట్టిగా బుద్ధి చెబుతారంటూ హెచ్చరించారు.