BRS Party | ఎలతుర్తి, మార్చి 2 7 : బీఆర్ఎస్ రజతోత్సవ సభ స్థలం కోసం గురువారం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వొడితల సతీశ్‌కుమార్, పెద్ది సుదర్శన్‌రెడ్డి రైతులతో చర్చించారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండల నాయకుల నుంచి వివరాలు సేకరించారు. డ్రోన్ కెమెరా ద్వారా మ్యాపింగ్‌ను తీసుకున్నారు. సభ నిర్వహణ కోసం రైతులు స్వచ్ఛందంగా భూములను ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తంచేయగా, వారి నుంచి ఎన్వోసీ తీసుకున్నారు. 1200 ఎకరాల వరకు మీటింగ్ హాల్, వాహనాల పారింగ్కు అవసరం ఉన్నట్టు గుర్తించారు. 800 ఎకరాలకు పైగా స్థలాన్ని ఇప్పటికే సేకరించారు. సభ ఎకడ జరిగేది బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో చర్చించాకే తుదినిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం.