హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ను, ఉద్యోగులను వంచించిందని బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్, పల్లె రవికుమార్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎన్నికల ముం దు నిరుద్యోగుల ఇండ్ల చుట్టూ, అశోక్‌నగర్ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి వారిని రెచ్చగొట్టిన కాంగ్రెస్, అధికారంలోకి రాగా నే వారి న్యాయమైన కోర్కెలను పట్టించుకోవడం లేదని దేవీప్రసాద్ ధ్వజమెత్తారు. మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ వేశార ని, తక్షణమే 25 వేల పొస్టులతో మెగా డీఎస్సీ వేయాలని డిమాండ్ చేశారు. కొందరు ఏపీ అధికారులను సచివాలయంలో నియమించి తెలంగాణ ఉద్యోగులపై పెత్తనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని దేవీప్రసాద్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగ నేతలు యోధులుగా కనిపించారని, ఇపుడు వారు కాంగ్రెస్‌కు పనికిరాని వారిగా మారారని పల్లె రవికుమార్ ఎద్దేవా చేశారు. నిరుద్యోగ ఉద్యమకారిణి సింధూరెడ్డిని శంఖినిగా పేరొనడం ఓ కాంగ్రెస్ ఎమ్మెల్సీ మూర్ఖత్వమని,ఆ వ్యాఖ్యలకు వారు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు న్యాయం జరిగేదాకా వారికి బీఆర్ఎస్ వారికి రక్షణ కవచంలా నిలబడుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్‌రెడ్డి, ఇస్లావత్ రామచంద్రనాయక్ పాల్గొన్నారు.