పరిగిలో హరీశ్‌రావు పర్యటన.. బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టు
ఇండస్ట్రియల్ పార్క్ కోసం తమ భూములను గుంజుకోవద్దని ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఇవాళ వికారాబాద్ జిల్లా పరిగి మండలంలోని కాళ్లాపూర్ రానున్నారు. ఈ నేపథ్యంలో పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.

పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. శుభప్రద్ పటేల్‌ను ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేశారు.
పరిగి మండలంలోని కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం 1,197 ఎకరాలను సేకరించాలని నిర్ణయించిన నేపథ్యంలో తమ భూములను ఇచ్చేది లేదని రైతులు రిలే దీక్సలు చేపట్టారు. రైతు ఆందోళనలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఆయా గ్రామాల్లో పర్యటించి హరీశ్‌రావు సంఘీభావం తెలపనున్నారు.

Pargi Shubpradh Patel
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?