న్యూస్‌నెట్‌వర్క్, ఏప్రిల్ 6 (నమస్తేతెలంగాణ): తెలంగాణ వ్యాప్తంగా పంటలు నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు శనివారం రా ష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దీక్షలను చేపట్టాయి. ఎండిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలని, ఎన్నికల హామీ మేరకు మద్దతు ధర తో వడ్లను కొనుగోలుతోపాటు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశాయి.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, సూర్యాపేటలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, నిజామాబాద్‌లో బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్, కరీంనగర్లో మా జీ మంత్రి గంగుల కమలాకర్, బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్, ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి జోగు రామన్న, చెన్నూర్‌లో మాజీ మంత్రి, పెద్దపల్లి ఎంపీ అ భ్యర్థి కొప్పుల ఈశ్వర్, మాజీ విప్ బాల్క సు మన్, నిర్మల్‌లో ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, నిజామాబాద్ జిల్లా వేల్పూర్ ఎక్స్‌రోడ్‌లో మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాతా మధుసూదన్, మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, జనగామ జిల్లా పాలకుర్తిలోని రాజీవ్ చౌరస్తాలో మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో మాజీ మంత్రి స త్యవతిరాథోడ్, జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మాజీ చీఫ్ విప్ దా స్యం వినయ్‌భాస్కర్, వరంగల్ జిల్లా నర్సంపేటలో మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి మా లోత్ కవిత, సిద్దిపేటలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పీ వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో దీక్షలు నిర్వహించారు.
Palla1