 
                                                            నిజామాబాద్ : బాన్సువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్యకర్తల ఆందోళన చేపట్టారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. పోచారంను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు.
కేసీఆర్ పోచారానికి స్పీకర్ పదవి, లక్ష్మీపుత్రుడు బిరుదు ఇచ్చారని, వ్యవసాయ మంత్రిగా పోచారానికి కేసీఆర్ మంచి అవకాశం ఇచ్చారన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్తో అంటకాగుతున్న పోచారం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు బీఆర్ఎస్ నేతలను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
 
                            