టెండర్ లేకుండానే మూసీ కాంట్రాక్టా?
టెండర్ లేకుండానే మూసీ అభివృద్ధి పనులను నకిలీ కంపెనీలకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. నకిలీ కంపెనీలతో ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని మండిపడ్డారు. స్కామ్ స్టార్ రేవంత్ రోజుకో నకిలీ సంస్థను రాష్ర్టానికి తెస్తూ హర్షద్ రేవంత్ మెహతాగా మారారని ఆరోపించారు.
- నకిలీ కంపెనీలతో రేవంత్ ప్రచారం
- ఆయన హర్షద్ రేవంత్ మెహతా
- బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఫైర్
హైదరాబాద్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): టెండర్ లేకుండానే మూసీ అభివృద్ధి పనులను నకిలీ కంపెనీలకు అప్పగించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. నకిలీ కంపెనీలతో ప్రచార ఆర్భాటం చేసుకుంటున్నారని మండిపడ్డారు. స్కామ్ స్టార్ రేవంత్ రోజుకో నకిలీ సంస్థను రాష్ర్టానికి తెస్తూ హర్షద్ రేవంత్ మెహతాగా మారారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు చేసిన పనినే ఇప్పుడు రేవంత్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీనేత వాసుదేవరెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మెయిన్‌హార్ట్ సంస్థకు ప్రాధాన్యం ఇచ్చారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డి కూడా అదే సంస్థకు మూసీ అభివృద్ధి పనులు అప్పగిస్తున్నారని పేర్కొన్నారు. లుక్ అవుట్ నోటీసులు ఉన్న సంస్థకు మూసీ ప్రాజెక్టు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఝార్ఖండ్‌లో ఆ సంస్థ రూ. 16 కోట్లు దుబారా చేసినట్టు కాగ్ నివేదిక ఇచ్చిందని గుర్తుచేశారు. కేటీఆర్, హరీశ్‌రావుపై మైనంపల్లి హన్మంతరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు చెప్పారు. కిరాయి గూం డాలతో తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారని మండిపడ్డారు. ఆయన ఏం చదువుకున్నారో ఎవరికీ తెలియదని, ఎన్నికల అఫిడవిట్లో ఒక్కోసారి ఒక్కోలా పేర్కొన్నారని విమర్శించారు. ఆయన కొడుకు ఏ డాక్టరో తెలియదని, పిచ్చిగా ప్రవర్తిస్తున్న తన తండ్రికి చికిత్స చేసుకోవాలని క్రిశాంక్ సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

