సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అక్రమాల పుట్ట బద్దలైంది. ప్రజాధనానికి రక్షణగా ఉండాల్సిన ఆర్థిక విభాగమే అక్రమారులకు కొమ్ముకాస్తూ కోట్ల రూపాయల గోల్ మాల్ కు తెరలేపిన ఘటన తీవ్ర సంచలనం సృష్టిస్తున్నది. ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమై రెండేళ్లుగా బిల్లులు కోసం ఒకవైపు..మరోవైపు క్షేత్రస్థాయిలో చెమటోడ్చి పని చేసిన కాంట్రాక్టర్‌కు పైసలు చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడుతున్న అధికారులు .. రూల్స్ కు విరుద్ధంగా వేరొకరి ఖాతాల్లోకి నిధులు మళ్లించిన వైనం జీహెచ్ఎంసీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఒకే పనికి రెండుసార్లు (డబుల్ బిల్స్) చెల్లింపులు చేస్తూ ప్రభుత్వ ఖజానాను గుల్ల చేశారు. దాదాపు 90 మంది కాంట్రాక్టర్లకు డబుల్ బిల్లులు చెల్లించడం, రూ.కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన తీరు వెలుగులోకి రావడంతో కమిషనర్ కర్ణన్ ఈ భారీ నిధుల మళ్లింపు వ్యవహారంపై తీవ్రంగా స్పందించారు. అక్రమాలపై సమగ్ర వివరాలతో కూడిన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన విజిలెన్స్ డబుల్ పేమెంట్లు పొందిన కాంట్రాక్టర్లను పిలిచిపించుకుని నగదును రికవరీ చేసే పనిలో ఉన్నారు. దీంతో పాటు నిధుల మళ్లింపులో కీలకమైన చీఫ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ శరత్ చంద్ర లాగిన్ కట్ చేశారు. ఈ స్కాంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న కంప్యూటర్ ఆపరేటర్‌తో కలిసి ముసారాంబాగ్ ప్రాంతానికి చెందిన ఓ కాంట్రాక్టర్‌ను విజిలెన్స్ దృష్టి సారించింది. డబుల్ బిల్లులు పొందిన ఫైళ్లను, సిఫారసు లేటర్లు, డిజిటల్ సంతకాల ఐడీలను సీజ్ చేసి లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
ఒక్కొక్కటీగా వెలుగులోకి..
డబుల్ బిల్లుల చెల్లింపుల అంశంలో జీహెచ్ఎంసీ ఆర్థిక విభాగం లీలలు ఒక్కొక్కటీగా వెలుగులోకి వస్తున్నాయి. క్లాస్ -5 (ఐదో గ్రేడ్) కాంట్ట్రార్కు సంబంధించి చెల్లించాల్సిన బిల్లు రూ.19 లక్షలు ఉంటే జీఎస్టీ ఫోర్టల్‌లో 2 శాతం చెల్లించాల్సిన చోట కాంట్రాక్టరు పేరిట 1.20 కోట్లకు జీఎస్టీ బిల్లు జనరేట్ చేశారు. దీంతో సదరు కాంట్రాక్టరుకు మిగతా 16 శాతం జీఎస్టీ కట్టాలంటూ నోటీసులు అందుకోవడం గమనార్హం. మరో కాంట్రాక్టర్‌కు సంబంధించిన ఏసీ బిల్లును మరో ఏజెన్సీ ఖాతాలో క్రెడిట్ చేశారు. బిల్లు రానీ కా్ంర టాక్టర్ ఈఆర్పీని ఏకంగా బ్లాక్ చేయడం మరో వింత. ఒక కాంట్రాక్టర్‌కు ఎం.బుక్ ద్వారా రూ. 5,000 రావాలన్నా సంబంధిత హెచ్ఓడీ, ఏఈ, డీఈ ల చుట్టూ తిరుగుతూ సంతకాలు, తనిఖీలు చేయించుకోవాలని నిబంధనలు పెట్టే అధికారులు..అడ్డగోలుగా బిల్లులు మంజూరు చేయడంలో బాధ్యులైన అధికారులపై కఠినంగా వ్యవహరించాలని అడహక్ కాం ట్రాక్టర్లు చేస్తున్నారు.
ప్రభుత్వ బిల్లులు, డబుల్ పేమెంట్ల వ్యవహారంలో అధికారులు చేసిన తప్పులను తమపై రుద్దాలని చూస్తున్నట్లు కాంట్రాక్టర్ల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంట్రాక్టర్లు ఎవరూ డబుల్ పేమెంట్ కావాలని అడగలేదని, బిల్లుల పరిశీలనలో అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని స్పష్టం చేసిం ది. ఒక కాగితం తకువ ఉన్నా ముందు కు సాగని ఆడిట్ ప్రక్రియలో.. డబుల్ పేమెంట్లు ఎలా జరిగాయో అధికారులే జవాబు చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. సొంత తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కాంట్రాక్టర్లను బలిపశువులను చేయడం సరికాద ని మండిపడ్డారు. ఈ అంశంపై త్వరలోనే మున్సిపల్ కమిషనర్ కలిసేందుకు సిద్దమయ్యారు.
కాంట్రాక్టర్లకు న్యాయం చేయాలి
మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలో అభివృద్ధి పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు విడుదల చేయడంలో జరుగుతున్న జాప్యంపై కాంట్రాక్టర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జడ్సీ రాధికా గుప్తా తీరును వ్యతిరేకిస్తూ గురువారం అసోసియేషన్ అధ్యక్షుడు భాస్కర్ ఆధ్వర్యంలో ఎంఎంసీ ప్రధాన కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. పలుమార్లు అధికారులను కలిసి వినతులు అందజేసినా సమ స్య పరిషారం కాకపోవడంతో కాంట్రాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించి ఈ కార్యక్రమం చేపట్టినట్లు భాస్కర్ పేర్కొన్నారు.
పెండింగ్ బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని, లేకపోతే అసోసియేషన్ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కాంట్రాక్టర్ల సమస్యలను ప్రభుత్వం, సంబంధిత అధికారులు అత్యవసరంగా పరిషరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు భాసర్, వైస్ ప్రెసిడెంట్ రవీంద్ర సాగర్, జనరల్ సెక్రటరీ శివరాత్రి మల్లేష్, అసోసియేషన్ మెంబర్స్, పెద్ద సంఖ్యలో కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.