రైతు డిక్లరేషన్ ఓ డూప్.. బీఆర్ఎస్ నేతల వెల్లడి
వరంగల్ వేదికగా 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ ఓ డూప్ అని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
- రైతాంగాన్ని మోసం చేసిన కాంగ్రెస్
- 6న ఓరుగల్లు వేదికగా రైతుసభ
హనుమకొండ, ఏప్రిల్ 30: వరంగల్ వేదికగా 2022 మే 6న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌గాంధీ చేసిన రైతు డిక్లరేషన్ ఓ డూప్ అని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. గురువారం హనుమకొండ బాలసముద్రంలోని బీ ఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ మోసాన్ని ఎండగట్టేందుకు ఈనెల 6న ఓరుగల్లు వేదికగా పది వేలమందితో రైతుసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
రాష్ట్రంలోని రైతులకు రూ. 50వేల కోట్లు రుణమాఫీ అవసరం కాగా, రూ. 20 వేల కోట్లు మాత్రమే మాఫీ అయ్యాయని చెప్పారు. రైతుభరోసా రూ. 15వేలు ఇస్తామని అని రెండుసార్లు ఎగ్గొట్టారని విమర్శించారు. రెండున్నరేండ్లలో 813 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 2027లో రైతుల పక్షాన బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాం గ్రెస్ నేతలు, మంత్రి సీతక డిక్లరేషన్ అమలు కోసం పాటుపడాలని సూచించారు. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వకుండా అధికారులపై ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

