హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : రొయ్యల పెంపకంపై ఎల్నినో ప్రభావం పడుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జలాశయాలు, చె రువుల్లోని నీటి నాణ్యత దెబ్బతింటున్నది. దీంతో రొయ్యల ఎదుగుదల మం దగించడంతోపాటు వ్యాధులకు గురవుతున్నాయి.
నీటిలో పీహెచ్ స్థాయిలో హెచ్చుతగ్గులు, అమ్మోనియా, నైట్రేట్ స్థాయిలు పెరుగడం వల్ల రొయ్యలు ఒత్తిడికి గురవుతున్నట్టు మత్స్యకళాశాల ప్రొఫెసర్ నీరజ తెలిపారు. నిపుణుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటేనే రొయ్యల సాగు లాభదాయకమని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.