రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని కార్పొరేషన్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, హుజూరాబా ద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనం పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించా రు. రాష్ట్ర హోంశాఖ మంత్రి రేవంత్‌రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం సిగ్గుచేటని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిశోర్‌గౌడ్ విమర్శించారు.
ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాలు ఉండవచ్చు కానీ, దాడులు, విధ్వంసాలు, హింసాత్మక చర్యలు సమర్థనీయం కావని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మన్నె గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. సబ్జెక్ట్ మీద మాట్లాడే తెలివి లేకనే కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి వాహనంపై బండి దాడి చేయించారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆరోపించారు.
పట్టపగలు గూండాల్లా వ్యవహరిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని బీఆర్ఎస్ నాయకుడు శుభప్రద్ పటేల్ మండిపడ్డారు. కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసు, కారుపై బీజేపీ గూండాల దాడి దుర్మార్గమని ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ఖండించారు. దాడుల సంస్కృతి ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అభివర్ణించారు. కేంద్ర మంత్రిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బండి సంజయ్ బరితెగించి దాడులకు తెగబడటం దుర్మార్గమని బీఆర్ఎస్ యూఎస్ఏ బాధ్యుడు శ్రీధర్‌రెడ్డి ఖండించారు. రాష్ట్రంలో ఆటవిక పాలన