BRS Party | ముషీరాబాద్, జూన్ 21 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జల కాంతం సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు ఓపెన్ చేసి, వాటి ద్వారా చేస్తున్న తప్పుడు ప్రచారంపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోని, వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మేరకు శనివారం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, బిఆర్ఎస్ నాయకుడు ముఠా జై సింహ, బిఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ విష్ణువర్ధన్ రెడ్డి, బీసీ కార్పొరేషన్ మాజీ సభ్యుడు కిషోర్ గౌడ్ ఫిర్యాదు చేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గజ్జలకాంతం గాంధీభవన్ వేదికగా కేటీఆర్‌పై అనుచిత వాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో పడేందుకు గాంధీభవన్ వేదికగా కాంగ్రెస్ నేతలు కేటీఆర్‌పై తప్పుడు ప్రచారం, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో నైతిక విలువలు పెంపొందించే విధంగా రాజకీయాలు ఉండాలి తప్ప చిల్లర మల్లర రాజకీయాలు చేయడం తగదు అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసే చిల్లర రాజకీయాలపై తెలంగాణ ప్రజల అసహ్యించుకుంటున్నారని అన్నారు. బిఆర్ఎస్ అగ్ర నాయకులపై విమర్శలు చేయడం మానుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా అకౌంట్లో కేటీఆర్‌పై తప్పుడు చేస్తున్నా వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు అభిలాష్, తుంగ బాలు, శ్రీధర్ రెడ్డి, బల్ల శ్రీనివాస్ రెడ్డి, రాకేష్ కుమార్, దీన్ దయాల్ రెడ్డి, మాధవ్, చిట్టి, తలారి శ్రీకాంత్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.