హైదరాబాద్, అక్టోబర్ 8: ఆర్టీసీ చార్జీల పెంపు నిర్ణయాన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ గురువారం ‘చలో బస్‌భవన్’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉదయం 9 గంటలకు రేతిఫైల్ బస్టాండ్‌కు చేరుకుని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో ఆర్టీసీ బస్‌భవన్ వరకు ప్రయాణిస్తారు. అనంతరం టీజీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తారు.