KTR | రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ ప్రభుత్వం వేయాలనుకున్న విద్యుత్ ఛార్జీల భారాన్ని ఆపినందుకు విజయ సూచికగా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మేరకు ఇవాళ ఉదయం జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరిపాయి. బాణసంచాలు కాల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి, ఈఆర్సీని ఒప్పించి కరెంటు బిల్లుల భారం పడకుండా చూసినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లా కార్యాలయం వద్ద మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. బాణసంచా కాల్చారు. చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద బాల్క సుమన్ సమక్షంలో సంబురాలు జరిపారు. కోరుట్లలో జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు విజయోత్సవ సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కేంద్రంలో కేసీఆర్, కేటీఆర్ ఫ్లెక్సీలకు బీఆర్ఎస్ శ్రేణులు పాలాభిషేకం చేశాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై వేయాలనుకున్న రూ.18,500 కోట్ల విద్యుత్ చార్జీల భారాన్ని
ఈఆర్సీ ఎదుట వాదనలు వినిపించి
బీఆర్ఎస్ పార్టీ ఆపిన సందర్భాన్ని పురస్కరించుకొని చెన్నూర్ నియోజకవర్గ కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంబరాలు నిర్వహించడం జరిగింది. pic.twitter.com/eS3E2OjJHQ— Balka Suman (@balkasumantrs) October 30, 2024
నల్గొండ జిల్లాలో దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ నేతృత్వంలో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు నిర్వహించాయి. ఆర్మూరు నియోజకవర్గ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
Brs1
Brs3
Brs4
Brs5
Brs6