లగచర్ల రైతులపై దమనకాండకు నిరసనగా బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టాయి. నల్లగొండ జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, నేతలు.
BRS Leaders | లగచర్ల రైతులపై అక్రమ కేసులు పెట్టి, థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించడాన్ని ఖండిస్తూ మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఊరూరా అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేశారు.
మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, జడ్పీ మాజీ చైర్పర్సన్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయా చోట్ల అంబేద్కర్ విగ్రహాలను వినతి పత్రాలు సమర్పించారు.-నమస్తే తెలంగాణ నెట్వర్క్
మహబూబ్‌నగర్‌లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్. చిత్రంలో బీఆర్ఎస్ నాయకులు
నల్లగొండ జిల్లా దేవరకొండలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్
మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూరులో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి
జనగామ జిల్లా దేవరుప్పులలో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి, బీఆర్ఎస్ నేతలు
ఆలేరులో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
మెదక్‌లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పిస్తున్న ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు