BRS Leaders Arrest | సిరిసిల్ల రూరల్, మే 15 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టుల పర్వం కొనసాగుతుంది. జిల్లాలో మంత్రుల పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతలను ముందస్తు అరెస్టు చేయడం పరిపాటిగా మారిపోయింది.
తాజాగా శుక్రవారం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యట నేపథ్యంలో ఉదయాన్నే తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోని జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ సీనియర్ నేత మాట్ల మధును శుక్రవారం ఉదయాన్నే ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజ భింకార్ రాజన్నతో పాటు పార్టీ నేతలు మాట్ల మధుకు సంఘీభావం తెలిపారు. పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సరైనది కాదన్నారు. వీరిలో మాజీ జడ్పీటీసీ కోడి అంతయ్య, బీఆర్ఎస్ సీనియర్ నేత సురభి నవీన్ రావు, కేటీఆర్ సేన మండల అధ్యక్షులు నందగిరి భాస్కర్ గౌడ్, గుండు ప్రేమ్ కుమార్ తదితరులు ఉన్నారు.