Anugula Rakesh Reddy | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న వీఆర్ఏలపై పోలీసుల వైఖరిని ఎండగట్టారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజా పాలన అని ప్రశ్నించారు.
ధర్నాలు చేయడానికిధర్నా చౌక్ తెరుస్తామని పొంకణాల కొట్టారు.. ప్రజా పాలన అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజా సమస్యలు వింటామని, నిలపడ్డ చోటే పరిష్కారం చేస్తామని పొకిల్ల మాటలు చెప్పారని విమర్శించారు. ఆఖరికు వసూళ్లకు కౌంటర్లు పెట్టి కాంట్రాక్టర్లను లైన్లో నిలపెట్టారు. ప్రగతి భవన్ గేట్లు ఎత్తేసాం అన్నారు. పాకిస్తాన్ బార్డర్ లో లాగా బాహుబలి గేట్లు పెట్టారని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల, ఉద్యోగస్తులు, పీడితులు, బాధితులు, వాళ్ల బాధలు చెప్పుకోవడానికి వస్తే ఇలా చొరబాటుదారులను, తీవ్రవాదులను, సంఘ విద్రోహ శక్తులను అణిచివేసినట్టు దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
🔹ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజా పాలన ? ధర్నాలు చెయ్యడానికిధర్నా చౌక్ తెరుస్తాం అని పొంకణాల కొట్టారు.
🔹ప్రజా పాలన అంటూ ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నిత్యం ప్రజా సమస్యలు వింటామని, నిలపడ్డ చోటే పరిష్కారం చేస్తామని పొకిల్ల మాటలు చెప్పారు.
🔹ఆఖరికి వసూళ్లకు కౌంటర్లు… pic.twitter.com/VsNN5k3z6b
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) February 4, 2025
తమ న్యాయమైన డిమాండ్ లను పరిష్కరించాలని కోరుతూ ప్రజాస్వామ్యబద్ధంగా మంత్రులకు విన్నవించడానికి వచ్చిన వీఆర్ఏ లపై ప్రభుత్వ వైఖరిని, పోలీస్ జులుం ను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏనుగుల రాకేశ్ రెడ్డి తెలిపారు. వారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలిపారు. వీఆర్ఏ పోరాటానికి అండగా ఉంటామని, ప్రభుత్వం మెడలు వంచి వారి డిమాండ్లను పరిష్కరించే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏడాది కాలంగా తెలంగాణలో జరుగుతున్న అరాచకాల చూశారు కదా అందరూ కోరుకున్న ప్రజా పాలన ఇదేనా అని నిలదీశారు. ఈ ఏడాది ప్రజా కంఠక పాలనలో సుప్తావస్తలో ఉన్న మేధావులంతా ఇక మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తు చేశారు.