Kodangal | రైతు భరోసా ఎగ్గొట్టేలా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రైతు భరోసాపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు ఆదివారం ఆందోళనకు దిగాయి. పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించాయి. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని దౌల్తాబాద్ మండలం కేంద్రంలోనూ పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు.
దౌల్తాబాద్ మండల కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు నిరసనలు చేపట్టారు. రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రైతు భరోసా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.