హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దఎత్తున ఎన్నిక ల అక్రమాలకు పాల్పడుతున్నదని ఆరోపి స్తూ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ)కి ఫిర్యాదు చేసింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేష్‌రెడ్డి.. రాజ్యసభ సభ్యులు దీవకొండ దా మోదరరావు, బీ పార్థసారథిరెడ్డితో కలిసి గురువారం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అ ధికారాన్ని, అక్రమ ఓటర్ల సమీకరణను, బెదిరింపు వ్యూహాలను ఉపయోగించి ఎ న్నికల ప్రక్రియను ప్రభావితం చేయడాని కి అధికార కాంగ్రెస్, ఆ పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ ‘వ్యవస్థీకృత ప్రయత్నాలు’ చే స్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించారని బీఆర్ఎస్ నేతలు పేరొన్నారు. ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ కాకపోయినప్పటికీ మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారని, ఉపఎన్నికల్లో మైనారిటీ ఓటర్లను ప్ర భావితం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
ఆధార్‌తో అనుసంధానించిన డాటా, ఓటరు కార్డుల ఫొటోకాపీలు, నకిలీ చిరునామా ఆధారాలను ఉపయోగించి, కాంగ్రెస్ కార్యకర్తలు నకిలీ ఓటరు గు ర్తింపు కార్డులను సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. ఈ కార్డులను నియోజకవర్గం వెలుపల నుంచి తీసుకొచ్చిన వ్యక్తులకు పంపిణీ చేసి, అధికార పార్టీ అభ్యర్థికి చట్టవిరుద్ధంగా ఓటు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపింది. ఈ సీఐ తక్షణమే జోక్యం చేసుకోకపోతే పో లింగ్ రోజున ‘మాస్ ఐడెన్‌టిటీ ఫ్రాడ్’ జరిగే అవకాశం ఉంటుందని ఆందోళన వ్యక్తంచేసింది.
పోలింగ్ బూత్‌లు, ఓటర్ల కదలికలను ప్రభావితం చేయడానికి ‘కూలీలను’, రాజకీయంగా సంబంధం ఉన్న స్థానిక సమూహాలను అధికార పార్టీ సమీకరిస్తున్నదని బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. స్థానిక పోలీసులు, అధికారులు పాలక పార్టీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలను, ముఖ్యంగా మైనారిటీ సెల్ నుంచి వచ్చిన వారిని అదుపులోకి తీసుకోవడం, వేధించడం, బెదిరించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.
రాజ్యాంగంలోని అధికరణ-324 ప్ర కారం తన అధికారాలను ఉపయోగించి తక్షణమే నివారణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని కో రింది. సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర సాయుధ పోలీసు బలగాలను సీఏపీఎఫ్‌ను మోహరించాలని విజ్ఞప్తి చేసింది. యూసుఫ్‌గూడ, రహమత్‌నగర్, ఎర్రగ డ్డ, బోరబండ ప్రాంతాలను అతిసున్నితమైన ప్రాంతాలుగా గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. ప్రత్యేక కేంద్ర పరిశీలకులను నియమించాలని (జనరల్, పోలీస్, వ్యయం), నకిలీ, మోసపూరిత నమోదులను తొలగించడానికి ఓటరు జాబితాలను ధృవీకరించాలని కోరింది. ‘స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంతమైన పోలింగ్’ జరిగేలా చూడటానికి కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం అవసరమని బీఆర్ఎస్ తన ఫిర్యాదులో పేరొన్నది.