హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిషరించడంలో పూర్తిగా విఫలమై, బీఆర్ఎస్ నాయకులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని కుట్రలు పన్నుతున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంగళవారం ఆయన మాట్లాడారు. ప్రజా సమస్యలపై చర్చ జరుగకుండా ప్ర భుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, వేముల వీరేశం వ్యాఖ్యల వెనుక ఉన్నది స్వయంగా ముఖ్యమంత్రేనని, ఎమ్మె ల్యే శంకర్‌పై డీజీపీ తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రాణాలకు హాని తలపెట్టాలని చూసే ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకొని, వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగడానికి బీఆర్ఎస్ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్ ఆరోపించారు. మంత్రి సీతక తోటి మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దౌర్జన్యాన్ని కప్పిపుచ్చుతూ అబద్ధాలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కోవా లక్ష్మి విమర్శించారు.