Vinod Kumar | హైదరాబాద్ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 27వ చైర్మన్గా తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన చల్ల శ్రీనివాసులు శెట్టి నియామకం కావడం పట్ల మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. చల్ల శ్రీనివాసులు శెట్టి ఒక మారుమూల గ్రామంలో జన్మించి, ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం విద్యనభ్యసించి, ఇప్పుడు ఎస్బీఐ చైర్మన్గా నియామకం అయ్యే స్థాయికి ఎదగడం గొప్ప పరిణామమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
ఎస్బీఐ చైర్మన్గా ఇన్నేళ్ల కాలంలో తెలుగు వాళ్ళు ఎవరు నియామకం కాలేదని, ఇప్పుడు శ్రీనివాసులు శెట్టి నియామకం కావడం తెలంగాణ ప్రాంతానికి గొప్ప విశేషమని వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎస్బీఐ బ్యాంకు చైర్మన్గా నియామకం అయిన శ్రీనివాసులు శెట్టిని తెలంగాణ ప్రభుత్వం తరపున రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క సన్మానించాలని వినోద్ కుమార్ కోరారు.
ఇవి కూడా చదవండి..
Bhatti Vikramarka | విద్యుత్ సమస్యల పరిష్కారానికి 1912 హెల్ప్ లైన్ నంబర్ : భట్టి విక్రమార్క
TG CPGET 2024 | రేపు సీపీగెట్ – 2024 ఫలితాలు విడుదల..
TG PGECET | టీజీ పీజీఈసెట్ – 2024 ప్రవేశాలకు రీషెడ్యూల్ విడుదల
TG Weather | ఈ జిల్లాల్లో రెండురోజులు వానలు.. హెచ్చరించిన ఐఎండీ హైదరాబాద్