హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని బీఆర్ఎస్ నేత తుంగబాలు సూచించారు. సీఎం హోదాలో ఉన్న రేవంత్‌రెడ్డి హుందాగా వ్యవహరించాలని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. తన సామర్థ్యం తెలుసుకోలేనివాడు తనని నాయకుడిగా భావించే వారందరినీ నాశనం చేస్తాడని, రేవంత్‌రెడ్డి తీరు కూడా అలాగే ఉందని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన అం బేదర్ పేరును కొత్త సచివాలయానికి పెట్టిన చరిత్ర కేసీఆర్‌ది అని, దేశానికి భారతమాత ఎలాగో రాష్ర్టానికి తెలంగాణతల్లి అలాగని చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహం కాకుండా రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయానికి ఎదురుగా పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి అహంకారమే ఆయ న పతనానికి కారణమని పేర్కొన్నారు.
సచివాలయ విగ్రహంపై బీజేపీ వైఖరేమిటి? ; బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సతీశ్‌రెడ్డి డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల్సిన స్థలంలో రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ తన వైఖరిని స్పష్టం చేయాలని బీఆర్ఎస్ సో షల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రకటనలో డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ ముందు కేసీఆర్ ప్రతిపాదించిన తెలంగా ణ తల్లి విగ్రహం ఉండాలా? రేవంత్‌రెడ్డి ప్రతిపాదించిన రాజీవ్‌గాంధీ విగ్రహం ఉండాలా? అనే దానిపై కేంద్రమంత్రులై న కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పష్టత ఇ వ్వాలని డిమాండ్ చేశారు. బీజేపీ తీరు చూస్తుంటే రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నదనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. తెలంగాణను, తెలంగాణతల్లిని అవమానించేలా సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు.