Sunke RaviShankar | సీఎం రేవంత్ రెడ్డి భాష మీద మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాషను వింటే ముఖ్యమంత్రివా.. చిల్లరగానివా అని అనుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రా అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. నీ అవ్వ అంటే చిన్న పిల్లాడు కూడా దవడ పగలగొడ్తాడని తెలిపారు.
కేసీఆర్ పెట్టిన భిక్షతో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ అన్నారు. కేసీఆర్ చావునోట్లో తలపెట్టి తెలంగాణను సాధించారని తెలిపారు. పాలమూరు – రంగారెడ్డి డీపీఆర్ తిరిగి వచ్చిందని.. ఏం చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారని తెలిపారు. 90 శాతం పూర్తయిన ప్రాజెక్టును ఎందుకు వదిలేశారని అడిగారని పేర్కొన్నారు. నిన్ను ప్రశ్నించడం తప్పా అని నిలదీశారు. రేవంత్ రెడ్డిది నోరా.. మోరీనా అని ధ్వజమెత్తారు.
రాక్షసుడు తెలంగాణను పరిపాలిస్తున్నట్లుగా ఉందని సుంకె రవిశంకర్ విమర్శించారు. బలుపా.. అహంకారమా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నావని ప్రశ్నించారు. మేం తిట్టడం మొదలుపెడితే హుస్సేన్‌సాగర్‌లో దూకి సచ్చిపోతావని మండిపడ్డారు. నీ చావు మాటలు ఏంటి అని ప్రశ్నించారు. నువ్వు కొండముచ్చులెక్క ఉన్నావని విమర్శించారు. కేటీఆర్ సూపర్‌స్టార్ లెక్క ఉన్నాడని అన్నారు. ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాలో శిక్షణ ఇవ్వాలని ఐఏఎస్‌లకు సూచించారు. దుర్యోధనుడు, రావణాసురుడి లెక్క రేవంత్ రెడ్డి తీరు ఉందని అన్నారు. 2028లో జరిగే కురుక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ దహనమైపోతుందని తెలిపారు. తొండల భాష, రండల భాష ఇకనైనా మానుకోవాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డ పిచ్చాస్పత్రిలో చూపించాలని పీసీసీ చీఫ్, మంత్రులకు సూచించారు.