RSP | హైదరాబాద్ : వాట్సప్ గ్రూప్ నుండి తొలగించారని ఇద్దరు యువకులను బీజేపీ నేతలు కత్తులతో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు.
పది నిముషాలు సరదాగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సింది పోయి, పక్కా ప్లాన్ ప్రకారం పదునైన కత్తులతో దాడి చేసి ఇద్దరు అమాయకులను బీజేపీ నేతలు హతమార్చడం దారుణమన్నారు ఆర్ఎస్పీ. దేశం కోసం.. ధర్మం కోసం అంటూ రోజూ బాకా ఊదుకుంటూ యువతకు మీరు నేర్పింది హత్యారాజకీయాలేనా ఆచారి గారు..? అంటూ ఆర్ఎస్పీ నిలదీశారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిన హత్య కాదు.. మేం చెప్పినట్లు చేయకపోతే మిమ్ముల చంపి చెట్లకు వేలాడదీస్తాం జాగ్రత్త అని వార్నింగ్ ఇవ్వడం కోసం చేసిన పాశవిక హత్య అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. ఈ సంఘటనలో హంతకులతో పాటు వాళ్ల నాయకుల పాత్రను కూడా లోతుగా పరిశీలించి నిందితులు అందరినీ పీడీ యాక్టులో బుక్ చేసి జైల్లోనే పెట్టాల్సిందిగా తెలంగాణ డీజీపీని ఆర్ఎస్పీ డిమాండ్ చేశారు. హత్యా రాజకీయాలు చేస్తున్న పార్టీలను గ్రామాల్లో పాతర పెట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ఆర్ఎస్పీ తన ట్వీట్లో పేర్కొన్నారు.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం గొవిందాయిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నేత జల్కం రవి ఈ నెల 4న పుట్టిన రోజు వేడుకలు చేసుకొని ఆ ఫొటోస్ తమ గ్రామ వాట్సప్ గ్రూపులో షేర్ చేశాడు. దీనిపై అభ్యంతరం తెలిపిన యువకులు శేషిగారి శివ గౌడ్ (24), గుండెమొని శివ గౌడ్ (29) ఆ ఫొటోస్ డిలీట్ చేసి, జల్కం రవిని గ్రూపులో నుండి రిమూవ్ చేశారు. దీనిపై మాట్లాడేందుకు జల్కం రవి, బీజేవైఏం నేత పల్లె రాజు గౌడ్‌తో పాటు ఆ యువకులను తన వెంచర్‌లోని ఆఫీసుకు పిలిచాడు.
అక్కడ నలుగురు మందు తాగుతూ, జల్కం రవి ఆ యువకులను నా ఫొటోస్ డిలీట్ చేసి, నన్ను గ్రూప్ నుండి ఎందుకు రిమూవ్ చేశారంటూ అడిగాడు. ఈ విషయంలో మాట మాట పెరిగి జల్కం రవి, పల్లె రాజు గౌడ్ ఆ యువకులపై కత్తులతో దాడి చేసి విచక్షణారహితంగా నరికి చంపారు.
ఇది చాలా దారుణం..!
పది నిముషాలు సరదాగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకోవాల్సింది పోయి, పక్కా ప్లాన్ ప్రకారం పదునైన కత్తులతో దాడి చేసి ఇద్దరు అమాయకులను హతమార్చిండ్రు బీజేపీ నేతలు.!దేశం కోసం ధర్మం కోసం అంటూ రోజూ బాకా ఊదుకుంటూ యువతకు మీరు నేర్పింది హత్యారాజకీయాలేనా ఆచారి గారు?… https://t.co/HBsjeHEkwu
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) June 7, 2024