RS Praveen Kumar | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా కృషి చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందనలు తెలిపారు.
అధికార కాంగ్రెస్ పార్టీ అఘాయిత్యాలు చేసినా, ఎన్ని అవకతవకలకు పాల్పడినా, ఎన్ని ఘోరాలకు తెగించినా, తప్పుడు కేసులు బనాయించి, రౌడీలతో బెదిరించినా.. భయపడకుండా నిలబడిన ప్రతి కార్యకర్త ఈ ఎన్నికల్లో నైతికంగా విజేతే అని ఆయన పేర్కొన్నారు. 20 వేల దొంగ ఓట్లు ఉన్నాయని, కాంగ్రెస్ నాయకుల ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేసినా, దొంగ ఓటర్లను దొరకపట్టి అప్పజెప్పినా.. ఎన్నికల కమీషన్, పోలీసు యంత్రాంగం ఎలా పనిచేసిందో కళ్లారా చూశాం అని తెలిపారు. ఏదేమైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం అని ఆయన పేర్కొన్నారు. నవీన్ యాదవ్కు అభినందనలు. జై తెలంగాణ అని ఆర్ఎస్పీ నిననదించారు.