RS Praveen Kumar | హైదరాబాద్ : నిరుద్యోగులకు, గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పుస్తకాలు చదివారు. కాసేపు లైబ్రరీలో పుస్తక పఠనం చేసిన అనంతరం ఆర్ఎస్పీ అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
నిరుద్యోగులకు సంఘీభావంగా, గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగులతో పాటు పుస్తకాలు చదవడానికి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను పోలీసులు అడ్డుకున్నారు. తాను రాజకీయాలు చేయడానికి రాలేదు.. నిరుద్యోగ అభ్యర్థులతో కూడా మాట్లాడడానికి రాలేదు. లైబ్రరీలో చదువుకోవడానికి వచ్చాను. చదువుకునేందుకు వస్తే అడ్డుకోవడం ఏంటని పోలీసులపై ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను లైబ్రరీలోకి పోలీసులు అనుమతించారు.
నిరుద్యోగులకు, గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో పుస్తకాలు చదువుతున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ https://t.co/HvwPzRMqAp pic.twitter.com/TGBU8IGkO0
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2025