RSP | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి తనను అనేక రకాలుగా వేధిస్తున్నారంటూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు, బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం మండల అధ్యక్షుడు బానోత్ రవి (ఆర్మీ రవి) సోమవారం ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ వేదికగా స్పందించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒక న్యాయం, పేద గిరిజన బిడ్డలకు మరో న్యాయమా? చట్టం చెబుతున్నది ఇదేనా అని తెలంగాణ పోలీసులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
మాజీ ఆర్మీ జవాను బానోత్ రవి ఖమ్మంలో పోలీసు కమిషనర్ ఆఫీసు ముందు ఆత్మహత్యాయత్నం చేసి ఇప్పటికి దాదాపుగా 24 గంటలు అవుతున్నది. బాధితుడు ప్రైవేటు ఆసుపత్రిలో చావుతో పోరాడుతున్నాడు. ఇంత వరకు ఎఫ్ఐఆర్ దాఖలు కాలేదు. ఎందుకని అడిగితే ఇంతవరకు బాధితుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రి నుండి మెడికో లీగల్ సర్టిఫికెట్‌కు సంబంధించి ఇంటిమేషన్ రాలేదంట. రాకపోతే మీరే తీసుకొని సుమోటో కేసు చేయవచ్చు కదా? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
బానోత్ రవి సూసైడ్ ప్రయత్నమే ఒక కట్టుకథ అని పోలీసు అధికారులు కట్టుకథలు అల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఫిర్యాదులో పొంగులేటి పేరు లేకుండా ఇవ్వమంటున్నారంట. రేపు హాస్పిటల్ రికార్డులు కూడా తారుమారు అవుతాయి. బానోత్ రవి మీద ఉల్టా కేసు పెట్టినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఎందుకంటే మంత్రి పొంగులేటి గారిని రక్షించాలి కదా! మన హోం మంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడ..? ఇదే అదునుగా మంత్రి గారితో బేరసారాలు జరుపుతున్నారా?? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
తెలంగాణ డీజీపీ గారు.. మీకు డీజీపీగా ఇది చివరి రోజు.. మరణ వాంగ్మూలం ఆధారంగా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఒక్క గిరిజన కుటుంబానికి న్యాయం చేసి గద్దె దిగండి. పేద వర్గాలు గుర్తు పెట్టుకుంటారు అని డీజీపీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచించారు.
మంత్రి పొంగులేటి గారికి ఒక న్యాయం, పేద గిరిజన బిడ్డలకు మరో న్యాయమా?
చట్టం చెబుతున్నది ఇదేనా @TelanganaCOPs ?మాజీ ఆర్మీ జవాను బానోత్ రవి ఖమ్మంలో పోలీసు కమీషనర్ ఆఫీసు ముందు ఆత్మహత్యాయత్నం చేసి ఇప్పటికి దాదాపుగా 24 గంటలు అవుతున్నది. బాధితుడు ప్రైవేటు ఆసుపత్రిలో చావుతో… pic.twitter.com/wYtlRnYoNw
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 30, 2025