RS Praveen Kumar | హైదరాబాద్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యావ్యవస్థను గాలికి వదిలేసిన సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. బెస్ట్ అవెలబుల్ స్కూళ్లను రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని ఆర్ఎస్పీ ఘాటుగా స్పందించారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష ఎస్సీ ఎస్టీలంటే..? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. యంగ్ ఇండియా సమీకృత గురుకులాల పేరుతో రూ. 26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విద్యా శాఖకు రూ. 23 వేల కోట్లు కేటాయించింది. మరి బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు కోసం కనీసం రూ. 100 కోట్లు ఇవ్వలేరా? రేవంత్ గారు మీ మనుమలు, మనువరాల్లు చదివినట్టు ఈ పేద బిడ్డలు మంచి చదువు చదవొద్దా..? 25 వేల మంది పిల్లల బంగారు భవితను ఆగం చేయాలని చూస్తే ఊరుకోం అని రేవంత్ రెడ్డిని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
కాంగ్రేసు ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష ఎస్సీ ఎస్టీలంటే..?
యంగ్ ఇండియా సమీకృత గురుకులాల పేరుతో ₹26 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం…
విద్యా శాఖకు ₹23 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం.
బెస్ట్ అవైలబుల్ స్కీం కోసం కనీసం ₹100 కోట్లు ఇవ్వలేరా?
రేవంత్ గారు… pic.twitter.com/jgzPKPTBF9
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) April 9, 2025