పెద్దపల్లి : సుల్తానాబాద్(Sultanabad) మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ సునీత భర్త, బీఆర్ఎస్ నాయకుడు(BRS leader) ముత్యం రమేష్(Ramesh) గుండెపోటు(Heart attack)తో మృతి( Died) చెందాడు. సుల్తానాబాద్ పట్టణంలోని రమేష్ గృహంలో తీవ్ర అస్వస్థతకు గురికాగా స్థానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు.
కాగా, సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్‌గా కొనసాగుతున్న ముత్యం సునీతపై ఇటీవలే అవిశ్వాసం నెగ్గింది. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన రమేష్ గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు, కుటుంబ సభ్యులు తెలిపారు. రమేష్ మృతి పట్ల పలువురు నివాళులు అర్పించారు.