Rakesh Reddy | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఫలితంతో ఎవరూ నిరాశ చెందాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు. సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచినా.. నైతికంగా బీఆర్ఎస్సే గెలిచిందని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పటికీ.. వేల కొద్ది దొంగ ఓట్లు, బెదిరింపులు, దాడులు, చీరలు, మిక్సీలు, కుక్కర్లు, గ్రైండర్ల పంపిణి వల్లే కాంగ్రెస్ గెలిచిందన్నారు.
ఓటుకు ఐదు వేలు.. వీధికో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రచారం చేశారు. వారం రోజుల పాటు సీఎం వీధులు పట్టుకొని ప్రచారం నిర్వహించారు. ఎన్నికల రోజు బూతులు పట్టుకొని డిప్యూటీ సీఎం తిరుగుడు. పోలింగ్ రోజు బూతుల దగ్గర ఎమ్మెల్యేలు పోల్ స్లిప్పులు పట్టుకొని డబ్బులు పంచడం జరిగింది. సుమారుగా 55 బూతుల్లో రిగ్గింగ్ జరిగిందని రాకేశ్ రెడ్డి తెలిపారు.
ఇంకా మూడేళ్లు ప్రభుత్వం ఉంటది కదా.. ఇప్పుడే ఓడిస్తే మాకు ఏది అందదు కావచ్చు అనే ప్రజల ఆందోళన
మన బస్తీ పిలగాడు.. పాపం ఇప్పటికే రెండు సార్లు ఓడిపోయిండు అనే సానుభూతి. ఇవన్నీ కలిసి ప్రజాభిప్రాయాన్ని తారుమారు చేసినాయి. కాంగ్రెస్ పార్టీని గెలిపించాయి అని రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
వాస్తవానికి ఇది కాంగ్రెస్ లేదా రేవంత్ రెడ్డి గెలుపు అనడం కంటే నవీన్ యాదవ్ గెలుపు అనడం సముచితంగా ఉంటది. ఎందుకంటే కాంగ్రెస్ – నవీన్ యాదవ్ = ఏమి లేదు అక్కడ అని ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.