హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్‌నాయక్‌ను పోలీసులు అరెస్టు చేసినా ఆయన మూడురోజులుగా గాంధీ వైద్యశాలలో నిరాహారదీక్ష కొనసాగిస్తున్నారు. మోతీలాల్ ఆరో గ్యం క్షీణిస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదని నిరుద్యోగులు రగిలిపోతున్నారు.
ఉద్యోగాల కోసం చావోరేవో అనుకొనే అమరణ నిరాహార దీక్షకు దిగామని, లాఠీలతో కొట్టినా, ఠాణాల్లో పెట్టినా భయపడే ప్రసక్తే లేదని చెబుతున్నారు.నిరుద్యోగులు కొనసాగిస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతున్నది.రాజకీయ పార్టీల అనుబంధ సంఘా లు, బీఆర్ఎస్వీ, ఎస్ఎఫ్ఐ, ఐఏఎస్‌ఎఫ్, డీవైఎఫ్ఐ, ఏఐవైఎఫ్ వంటి సంఘాలు నిరుద్యోగులకు అండగా నిలిచాయి.
హెచ్‌సీయూలో విద్యార్థుల నిరసన
కొండాపూర్, జూన్ 26: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారుల తీరుపై విద్యార్థులు భగ్గుమన్నారు. యూనివర్సిటీ విద్యార్థులపై విధించిన సస్పెన్షన్, ఫైన్లు, ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని వర్సిటీ ప్రధాన గేటు ముందు విద్యార్థులు బుధవారం ఆందోళన చేపట్టారు.
యూనివర్సిటీలో నిర్వహించే సుకూన్ ఈవెంట్‌ను రద్దు చేశారని విద్యార్థి నేతలు తెలిపారు. దీంతో వీసీ ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశామని, దాంతో అడ్మినిస్ట్రేషన్ విభాగం అధికారులు ఐదుగురు విద్యార్థులను ఆరు నెలలపాటు సస్పెండ్ చేసినట్టు హెచ్‌సీయూ యూనియన్ ప్రెసిడెంట్ అతిక్ అహ్మద్ తెలిపారు. మరో ఐదుగురు విద్యార్థులకు రూ.10 వేల చొప్పు న ఫైన్‌తోపాటు ఎఫ్ఐఆర్లను నమోదు చేయించినట్టు తెలిపారు. వెంటనే వర్సిటీ యాజమాన్యం తమపై విధించిన సస్పెన్షన్, ఫైన్లు, ఎఫ్ఐఆర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.