ములుగురూరల్, డిసెంబర్ 1 : కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, ములుగు జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి విమర్శించారు. అందుకే గురుకులాల్లో వరుస మరణాలు, ఆహారం కల్తీ అవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తనట్టు వ్యవహరిస్తుందని తెలిపారు. ములుగు జిల్లా జాకారంలోని సోషల్ వెల్ఫేర్, బండారుపల్లి రెసిడెన్షియల్ గురుకులాన్ని వారు పరిశీలించారు. ప్రభుత్వ వసతుల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. గురుకులాల్లో పారిశుధ్యం లోపించడంతో వారే స్వయంగా బ్లీచింగ్ పౌడర్ చల్లా రు. అనంతరం రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ రేవంత్‌రెడ్డికి ఇంకా కొత్తగా ముఖ్యమంత్రి అయిన మురిపెం పోలేదని, పాలనపై పట్టు కోల్పొయి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తా రు. కేసీఆర్ హయాంలో గురుకులాలు దేశానికే నాడు ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్క రాజకీయ ప్రకటనలు చేస్తూ పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆత్మైస్థెర్యా న్ని దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. కాస్మొటిక్ సామగ్రి, దుప్పట్లు సరిగా లేక విద్యార్థులు ఇబ్బందిపడుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి తెలిపారు. మంత్రి సీతక్కకు రాష్ట్రం మొత్తం తిరిగే సమయం ఉంది.. కానీ సొంత ములుగు ప్రాంతంలోని గురుకులాలను సందర్శించే సమయమే లేకుండా పోయిందని ఎద్దేవా చేశారు.
ఆసిఫాబాద్ టౌన్: కాంగ్రెస్ పాలనలో విద్యాసంస్థలు నిర్వీర్యం అయ్యాయని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి విమర్శించారు. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా ఇన్చార్జి ముస్తఫాతో కలిసి ఆదివారం జిల్లా కేంద్రంలోని పీటీజీ గురుకుల పాఠశాలను ఆమె పరిశీలించారు. వంటశాల పరిసరాలతోపాటు మెనూను పరిశీలించారు.