హనుమకొండ: హనుమకొండ జిల్లాలోని మడికొండలో బీఆర్ఎస్ గురుకుల బాట (Gurukula Bata) ఉద్రిక్తతకు దారితీసింది. పార్టీ నాయకుడు రాకేశ్ రెడ్డి, కార్పొరేటర్లు రాధిక రెడ్డి, రవి నాయక్ ఆధ్వర్యంలో మడికొండలోని సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన బీఆర్ఎస్ లీడర్లను పోలీసులు అడ్డుకున్నారు. అనుమతి లేదంటూ పాఠశాలలోకి వెళ్లకుండా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, పార్టీ కార్యకర్తలకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకున్నది. రాకేశ్ రెడ్డి సహా 50 మంది కార్యకర్తలను బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకుని మడికొండ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా రాకేశ్ రెడ్డి మాట్లాడుతూ.. గురుకులాలు బాగయ్యే వరకు కాంగ్రెస్ సర్కార్‌పై పోరాటం కొనసాగుతుందన్నారు. సమస్యలకుప రిష్కారం చూపకుండా ప్రభుత్వం నిర్బంధాలకు పాల్పడటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హనుమకొండ జిల్లాలోని మడికొండలో సోషల్ వెల్ఫేర్ ఆశ్రమ గురుకుల పాఠశాలలో బిఆర్ఎస్ గురుకుల బాటలో ఉద్రిక్తత
బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి, కార్పొరేటర్లు రాధిక రెడ్డి, రవి నాయక్ ల ఆధ్వర్యంలో గురుకుల బాట సందర్శన నిమిత్తం ఆశ్రమ పాఠశాలకు వెళ్లిన వెళ్లిన టిఆర్ఎస్ నాయకులను… pic.twitter.com/0E914m9uWu
— Telugu Scribe (@TeluguScribe) December 3, 2024