Manne Krishank | హైదరాబాద్ : ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఒక్క ఫ్రీ బస్సు హామీ తప్ప మిగతా హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని మండిపడుతున్నారు. రైతులకు, నిరుద్యోగులకు ఎన్నో ఆశలు చూసిన కాంగ్రెస్.. చివరకు వారిపట్ల మొసలి కన్నీరు కారుస్తోందని ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అయితే కాంగ్రెస్ యూటర్న్(U Turn) ప్రభుత్వం అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. అనుముల కాదు.. అబద్దాల రేవంత్ అంటూ క్రిశాంక్ ట్వీట్ చేశారు. వడ్లకు రూ. 500 బోనస్ విషయంలో యూటర్న్, రైతుకు రూ. 15 వేల రైతు భరోసా విషయంలో యూటర్న్, యువతకు నిరుద్యోగ భృతి రూ. 4 వేల విషయంలో యూటర్న్, పోటీ పరీక్షలకు దరఖాస్తు ఫీ విషయంలో యూటర్న్, సీఎం రేవంత్ ప్రజా దర్బార్ విషయంలో యూటర్న్ తీసుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి క్రిశాంక్ తన ట్వీట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా U Turn కు క్రిశాంక్ సరికొత్త నిర్వచనం కూడా ఇచ్చారు. దానికి సంబంధించిన ఇమేజ్ను క్రిశాంక్ తన ట్వీట్‌కు జత చేశారు.
వడ్లకు 500 రూపాయల బోనస్ ⤵️
రైతులకు 15వేల రూపాయల రైతు భరోసా⤵️
యువతకు నిరుద్యోగ భృతి రూ.4000⤵️
పోటీ పరీక్షలకు అప్లికేషన్ ఫీ ⤵️
సీఎం రేవంత్ ప్రజాదర్బార్ ⤵️కాంగ్రెస్ U Turn ప్రభుత్వం
“అనుముల కాదు అబద్ధాల” @revanth_anumula pic.twitter.com/63Xhpp7q14— Krishank (@Krishank_BRS) May 21, 2024