రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి.. బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ తీవ్ర ఆగ్రహం
రేవంత్సర్కార్ రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత క్యామ మల్లేశ్ ధ్వజమెత్తా రు. ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదని దుయ్యబట్టారు.
- మాటలు కోటలు దాటినా గడపదాటని చేతలు
- రైతుబంధు ఎగ్గొట్టి.. కొనుగోళ్లపై చేతులెత్తేశారు
హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : రేవంత్సర్కార్ రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత క్యామ మల్లేశ్ ధ్వజమెత్తా రు. ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదని దుయ్యబట్టారు. రైతుబంధు, రుణమాఫీని ఎగ్గొట్టి రైతాంగాన్ని దారుణంగా మోసంచేశారని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్లో విలేకరులతో మల్లేశ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు చేయలేని దుస్థితి దాపురించిందని విమర్శించారు.
రాజకీయాల్లో ఎంతో అనుభవమున్న మంత్రి తుమ్మల.. రేవంత్‌రెడ్డితో దోస్తీ చేసి మొద్దుబారిపోయారని చురకలంటించారు. రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి కేసీఆర్‌పై ఎగిరెగిరిపడ్డ ఆకునూరి మురళి ఇప్పుడు తోకముడిచి రాజీనామా చేశారని ఎద్దేవా చేశారు. మంత్రులు అవగాహన లేకుండా మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ వచ్చాక హత్యారాజకీయాలు పెరిగాయని ఆరోపించారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ నేతను హతమార్చిన దుండగులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
భూ దోపిడీపైనే ఎనుముల బ్రదర్స్ దృష్టి : మెతుకు ఆనంద్
సీఎం అండతో ఎనుముల బ్రదర్స్ రెచ్చిపోతున్నారని మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ధ్వజమెత్తారు. ఇష్టారాజ్యంగా భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. 30 నెలల కాంగ్రెస్ పాలనలో వికారాబాద్ జిల్లాకు ఒరిగిందేమీలేదని విమర్శించారు. ఈ జిల్లాకు సీఎం, స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నా అభివృద్ధి శూన్యమని దెప్పిపొడిచారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ పాదయాత్ర ప్రకటనల తర్వాతే సర్కార్‌లో కదలిక వచ్చిందని గుర్తుచేశారు. ఇక నైనా హామీలపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | ఇండియన్ ఆర్మీలో 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 57.. జేఈఈ మెయిన్ స్కోర్‌తో ప్రవేశాలు
Rajamouli | అమెరికాలో రాజమౌళి.. ‘వారణాసి’ షూటింగ్‌కు విరామం, కుటుంబ వేడుకలో సందడి!
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

