హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్ తీరుతో ఏపీకి లాభం కలుగుతూ తెలంగాణకు నష్టం వాటిల్లుతున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి క్రిశాంక్ విమర్శించారు. గ్రీన్కో కంపెనీ విషయంలో కేటీఆర్‌పై నిరాధార ఆరోపణలు చేశారని ఆదివారం ఎక్స్ వేదికగా విమర్శించారు.
గత ప్రభుత్వంలో గ్రీన్ కో కంపెనీ పేరిట మోసం చేసినట్టు ఆరోపించారని మండిపడ్డారు. అదే గ్రీన్ కో కంపెనీని ఏపీ డిప్యూటీ సీఎం స్వాగతించారని పేర్కొన్నారు. పవన్‌కళ్యాణ్ గ్రీన్ కోపై ప్రశంసలు కురిపిస్తున్న వీడియోను క్రిశాంక్ పోస్ట్ చేశారు.