హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీపై ఏర్పాటు చేస్తున్న లోగోపై బీఆర్ఎస్ నేత కొణతం దిలీప్ విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించని ఒక అనధికారిక చిహ్నాన్ని కాలే జీ భవనం మీద ఎలా ఏర్పాటు చేస్తారని బుధవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
ఈ విషయంలో స్పందించాలని సీఎస్, నాగర్ కర్నూ ల్ కలెక్టర్‌ను కోరారు. మీరు ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. సరస్ కంపెనీని కాదు. రాష్ట్ర అధికారిక చిహ్నానికి ఎంతో గౌర వం, ప్రతిష్ట ఉంటుంది. దీన్ని పిల్లలాటగా మార్చవద్దు అని విజ్ఞప్తి చేశారు. లోగో ఏర్పా టు చేస్తున్న వీడియోను జత చేశారు. చి హ్నం తానే తయారు చేశానంటూ తప్పుడు కేసు పెట్టినా ఆశ్చర్యం లేదని ఎద్దేవా చేశారు.