Kadiyam Srihari | తాను బీఆర్ఎస్ పార్టీ వీడుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందించారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
తాను పార్టీ మారడం లేదని.. కొందరు కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారని కడియం శ్రీహరి వెల్లడించారు. బీఆర్ఎస్లో ఎవరూ పార్టీని వీడటం లేదని ఆయన తెలిపారు. పార్టీలో ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని స్పష్టం చేశారు.