హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్‌పై ఈగ వాలినా ఊరుకోబోమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ జూన్ 4న ఇందిరా పారు వద్ద మహాధర్నా చేపడుతున్నట్టు ప్రకటించారు. శనివారం బంజారాహిల్స్‌లోని తన నివాసం సమీపంలో తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయాన్ని ఆమె ప్రారంభించారు.
అంబేదర్, జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గోదావరి జలాల్లో 200 టీఎంసీల హకు తెలంగాణకు ఉండాలని కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని గుర్తుచేశారు.
‘ఏటా 20 లక్షల ఎకరాలకు కాళేశ్వరం ద్వారా నీళ్లు అందించినందుకు కేసీఆర్‌కు నోటీసులిచ్చారా? తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చేసిందుకా? రైతుబీమా, రైతుబంధు ప్రైవేశ పెట్టిందుకా..? నోటీసులు దేనికిచ్చారు?’ అని ప్రశ్నిం చారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడమంటే యావత్తు తెలంగాణకు ఇచ్చినట్టేనని స్పష్టంచేశారు. కాళేశ్వరంపై వేసింది కాళేశ్వరం కమిషనా? లేక కాంగ్రెస్ కమిషనా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ తెలంగాణ సోయితో పరిపాలన చేశారని, రేవంత్‌రెడ్డి జై తెలంగాణ అని అనకపోవడం మన ఖర్మ అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి తెలంగాణపై సోయి తెచ్చుకుని జై తెలంగాణ అనాలని, అమరులకు నివాళులర్పించాలని డిమాండ్ చేశారు.
యువతకు స్వయం ఉపాధి కోసం అంటూ ప్రారంభిస్తున్న యువవికాసం పథకానికి రాజీవ్‌గాంధీ పేరు పెట్టడం ఏమిటని కవిత నిలదీశారు. దాన్ని తెలంగాణ యువవికాసంగా మార్చాలని లేదా శ్రీకాంతాచారి, యాదిరెడ్డి, కాళోజీ లేదా పీవీలో ఎవరి పేరైనా పెట్టాలని అన్నారు.
తెలంగాణ నీళ్లను ఏపీ తరలించుకుపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించడం లేదని కవిత ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబు బనకచర్ల ప్రాజెక్టు నిర్మించి నీళ్లు తరలించాలనుకుంటున్నా రేవంత్ కనీసం మాట్లాడడం లేదని మండిపడ్డారు. పక రాష్ట్రం ప్రయోజనాల కోసం ఎందుకు పనిచేస్తున్నారని రేవంత్‌రెడ్డిని నిలదీశారు. గోదావరి జలా ల్లో తెలంగాణ వాటా కాపాడకపోతే జా గృతి పవర్ చూపిస్తామని హెచ్చరించారు.
బీసీ బిల్లును ఆమోదించకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తాత్సారం చేస్తున్నదని కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. బీసీ బిల్లు కోసం ఏడాదిన్నరగా తెలంగాణ జాగృతి పోరాటం చేస్తున్నదని గుర్తు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కే వరకు పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. జాగృతి కార్యాలయ కార్యదర్శిగా పొన్నమనేని బాలాజీరావును నియమిస్తూ కవిత ఉత్తర్వులు జారీ చేశారు.