కారేపల్లి, ఆగస్టు 14: ఖమ్మం జిల్లా కారేపల్లి మండల కేంద్రానికి చెందిన ఉద్యమకారుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు జడల వెంకటేశ్వర్లు(57) గురువారం రాత్రి గుండెపోటుతో మరణించారు. పనిమీద మహబూబాబాద్ వెళ్లగా అక్కడ ఒకసారిగా సొమ్మసిల్లి పడిపోయారు.
అతని వెంటఉన్నవారు వెంటనే దవాఖానకు తరలించేలోపే మృ తిచెందారు. తెలంగాణ ఉ ద్యమకాలంలో వెంకటేశ్వ ర్లు చురుకైన పాత్ర పోషించారు. శుక్రవారం కారేపల్లి లో ఆయన అంత్యక్రియలు జరపనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.