Rythu Runa Mafi | రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేశామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. మామకి రుణమాఫీ చేశామన్న కారణం చెప్పి, అల్లుడికి రుణమాఫీ చేయకపోవడం ఏంటని నిలదీశారు. ఇదెక్కడి నిబంధన అని ప్రశ్నించారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దిరావత్ హరీశ్ అనే యువ రైతు పేరిట రూ.1,02,377 రుణం ఉంది. ఈ రుణమాఫీ కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని హరీశ్‌రావు తెలిపారు. మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ సమస్యకు పరిష్కారం దక్కలేదని ఆవేదన చెందుతున్నాడని పేర్కొన్నారు. ఈ యువ రైతుకు వెంటనే రుణమాఫీ చేసి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దిరావత్ హరీశ్ అనే యువ రైతు యూనియన్ బ్యాంకు నుంచి 2017లో రూ.1,02,377 పంట రుణం తీసుకున్నాడు. కానీ అతని రుణం మాఫీ కాలేదు. దీనిపై అధికారులను సంప్రదించగా.. హరీశ్ మామ హనుమంతుకు ఎస్బీఐలో రూ.1,07,259 పంట రుణం ఉన్నదని.. అది మాఫీ అయ్యింది కాబట్టి తన రుణం మాఫీ కాలేదని చెప్పారు. దీనిపై దిరావత్ హరీశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు నాలుగేళ్ల క్రితమే వివాహమైందని.. తన మామతో తనకు సంబంధం లేదని చెబుతున్నాడు. వెంటనే తన పంట రుణాన్ని మాఫీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
రుణమాఫీ పూర్తి చేసినట్లు చెప్పుకుంటున్న @revanth_anumula గారు.. మామకి రుణమాఫీ చేశామన్న కారణం చెప్పి, అల్లుడికి చేయకపోవడం ఏమిటి. ఇదెక్కడి నిబంధన?
నల్గొండ జిల్లా మిర్యాలగూడ కు చెందిన దిరావత్ హరీష్ యువ రైతు రూ. 1,02, 377 రుణ మాఫీ కాక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నడు. మంత్రులు,… pic.twitter.com/BXGqNzbeO6
— Office of Harish Rao (@HarishRaoOffice) February 8, 2025