Harish Rao | కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని హరీశ్‌రావు తెలిపారు. మల్లన్న సాగర్‌కు రా పోదామని అన్నారు. కొండపోచమ్మలో ఉన్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కావా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు 20 టీఎంసీలు, మూసీకి 5 టీఎంసీ లు నీళ్లు తీస్కొని పోతా అంటున్నవ్.. అవి కాళేశ్వరం నీళ్లు కావా అని నిలదీశారు. ఎన్ని రోజులు ఇట్లా మోసం చేస్తావని మండిపడ్డారు.
కూలింది కాళేశ్వరం కాదు నీ మెదడు అని సీఎం రేవంత్ రెడ్డిని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రిపేర్ చేయొచ్చని ఎల్అండ్టీ వాళ్లు చెబుతున్నారని అన్నారు. తలచుకుంటే మూడు నెలల్లో రిపేర్ చేయవచ్చని తెలిపారు. ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలుపుకోవాలని డిమాండ్ చేశారు. 100 రోజుల్లో హామీలను అమలు చేస్తామని.. 400 రోజులైనా ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలేదని విమర్శించారు. 400 రోజుల నీ పాలనలో 400 రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు.
గిరిజనుల భూములను లాక్కుంటున్నావ్.. కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నావ్ అని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు. బంగారం లాంటి పంటలు పండే భూములను లాక్కొని రైతులకు అన్యాయం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రైతుల ఉసురు పోసుకుంటున్నాడని అన్నారు.
నా తమ్ముడు గొప్పోడు అంటున్నాడని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు. నీ తమ్ముడు కలెక్టర్ల తో సెల్యూట్ కొట్టించుకున్నాడు అని గుర్తు చేశారు. ఇది మంచి పద్ధతా అని ప్రశ్నించారు. ఇదా మీ తమ్ముడు చేసే ప్రజా సేవ అని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట నిలుపుకోలేదని విమర్శించారు.50 సంవత్సరాలు పాలించిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలు 5 మెడికల్ కాలేజీలు పెడితే పదేండ్లలో కేసీఆర్ 30 మెడికల్ కాలేజీలను పెట్టాడని హరీశ్‌రావు తెలిపారు. జిల్లాకొకటి మెడికల్ కాలేజీ పెట్టిన ఘనత కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీది అని చెప్పారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన పాపం కాంగ్రెస్ పార్టీది అని విమర్శించారు.
మనం ప్రజలను నమ్ముకున్నాం.. కాంగ్రెస్ వాళ్ళు పోలీసులను నమ్ముకున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలనుద్దేశించి హరీశ్‌రావు అన్నారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని స్పష్టం చేశారు. మళ్ళీ మంచి రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు.