Harish Rao | మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లిన హరీశ్‌రావు.. మీరు చెప్పిన విధ్వంసకర బజార్లో ప్రేమ దుకాణం అంటే ఇదేనా అని విమర్శించారు.
మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న కేటీఆర్‌పై కాంగ్రెస్ రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. ప్రజా ప్రతినిధుల ఇళ్ల మీద దాడులు, నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ అని నిలదీశారు.
కేటీఆర్‌పై దాడికి తెగబడిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని తెలంగాణ డీజీపీని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్)లో తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ విఫలమైందని పేర్కొన్నారు.
Shri @RahulGandhi ji
ఇదేనా మీరు చెప్పిన
नफरत के बाजार में मोहब्बत की दुकान?మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న @KTRBRS గారిపై జరిగిన కాంగ్రెస్ రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజా పాలన అంటే… pic.twitter.com/qIcllA53jH
— Harish Rao Thanneeru (@BRSHarish) October 1, 2024
అసలేమైంది?
మూసీ- హైడ్రా బాధితులకు అండగా నిలబడ్డారని ఇప్పటికే హైదరాబాద్ తెలంగాణ భవన్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు.. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపైనా దాడికి తెగబడ్డారు. గోల్నాక మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా ముషీరాబాద్‌లో కేటీఆర్ కారును అడ్డుకున్నారు. ఆపై దాడికి యత్నించారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది, బీఆర్ఎస్ కార్యకర్తలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ గూండాలు ఏ మాత్రం తగ్గలేదు. కొందరైతే ఏకంగా కారుపైకి ఎక్కి మరీ దురుసుగా ప్రవర్తించారు. చివరకు బీఆర్ఎస్ శ్రేణులు వారిని తన్ని తరిమివేశారు. అనంతరం అంబర్‌పేట గోల్నాక పరిధిలోని తులసీరామ్ నగర్ వెళ్లిన కేటీఆర్ అక్కడ మూసీ బాధితులను పరామర్శించారు.