Harish Rao | ఖమ్మం జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలం జాన్‌పహాడ్ తండాకు చెందిన రైతు ఏలేటి వెంకట్‌రెడ్డి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వెంకట్‌రెడ్డి మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణించడం ప్రజాపాలనపై రైతులు కోల్పోతున్న నమ్మకానికి నిదర్శనమని చెప్పారు.
ఇటీవలే ఖమ్మం జిల్లాలోని చింతకాని మండలంలో జరిగిన రైతు ఆత్మహత్య ఘటన మరువక ముందే మరో రైతు మరణించడం శోచనీయమని హరీశ్‌రావు అన్నారు. రైతులు అధైర్యపడవద్దని.. ఏమైనా సమస్యలుంటే పోరాడి పరిష్కరించుకుందామని తెలిపారు. చావు సమస్య పరిష్కారానికి మార్గం కాదని అన్నారు.
ఖమ్మం జిల్లాలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడడం దురదృష్టకరం. ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాకు చెందిన రైతు ఏలేటి వెంకట్ రెడ్డి మృతి బాధకరం. పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసిన వెంకట్ రెడ్డి మూడు రోజులపాటు మృత్యువుతోపోరాడి మరణించడం ప్రజాపాలనపై రైతులు కోల్పోతున్న… pic.twitter.com/eyrv8BuF8l
— Harish Rao Thanneeru (@BRSHarish) August 7, 2024